ఈమధ్య కాలంలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. ఏలూరు జిల్లాలో హిజ్రాల ఓవరాక్షన్ తో పెళ్లి ఫంక్షన్ లో గందరగోళం నెలకొంది. నూజివీడులో ఏ ఇంట్లో శుభకార్యం జరిగిన డబ్బులు ఇవ్వాలని హిజ్రాల డిమాండ్ పెరిగిపోతోంది. డబ్బు ఇవ్వకపోతే అడిగినంత ఇవ్వకపోతే శుభకార్యానికి వచ్చిన వారిని దుర్భాషలాడుతున్నారు హిజ్రాలు. ముసునూరు మండలం కాట్రేనిపాడులో నిశ్చితార్థ కార్యక్రమంలో 11 వేల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారు హిజ్రాలు..ఇవ్వని ఇంటి యజమాని శుభకార్యానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దుర్భాషలాడారు హిజ్రాలు.
Read Also: Liquor Scam: ఛత్తీస్‌గఢ్‌లో రూ.2వేల కోట్ల మద్యం కుంభకోణం.. ఐఏఎస్ అధికారిదే కీలక పాత్ర!
హిజ్రాల తీరుతో యజమాని నూజివీడు రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. హిజ్రా నాయకులను, పలువురు హిజ్రాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. మరొకసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సిఐ అంకబాబు. గతంలోనూ హిజ్రాలపై అనేక ఆరోపణలు వున్నాయి. ఇటీవల ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో యువకుడిపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. మార్చి నెలలో లంబాడీ డొంక ప్రాంతానికి చెందిన నాయబ్ రసూల్ అనే యువకుడు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ వేడుకకు వెళ్లివచ్చే క్రమంలో కొంతమంది హిజ్రాలు అతనికి కనిపించారు. మాట్లాడుకుంటుండగా నాయబ్ రసూల్‌కు, వారికీ చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన హిజ్రాలు అతనిపై దాడి చేశారు. తాము తెచ్చుకున్న కర్రలు, ఇనుపరాడ్లు, బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. దీనిపై బాధితుడు ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. హిజ్రాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటున్నారు బాధితులు.
Read Also: Liquor Scam: ఛత్తీస్‌గఢ్‌లో రూ.2వేల కోట్ల మద్యం కుంభకోణం.. ఐఏఎస్ అధికారిదే కీలక పాత్ర!