NTV Telugu Site icon

Rohit Sharma: మూడు రికార్డులకు ఒక్క అడుగు దూరంలో హిట్ మ్యాన్.. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్ లో సాధించేనా..!

Rohit Sharma

Rohit Sharma

ప్రపంచకప్‌ 2023లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మంచి ప్రదర్శన కనిపిస్తున్నాడు. టోర్నీలో ఓ సెంచరీ నమోదు చేయగా.. మిగిలిన మ్యాచ్ ల్లోనూ దూకుడుగా ఆడి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తర్వాత జరిగే ఇంగ్లండ్‌ మ్యాచ్‌తో రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అయితే ఒకటి, రెండు కాదు.. మూడు రికార్డులను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనున్నాడు. భారత్ తన ఆరో మ్యాచ్ ను రేపు లక్నోలో ఇంగ్లాండ్ తో ఆడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు రోహిత్ శర్మ ఫామ్‌ను చూస్తుంటే.. అతను మూడు రికార్డులను ఈజీగా చేయగలడని అనిపిస్తుంది. అయితే తన రికార్డులు ఏమిటో తెలుసుకుందాం.

Read Also: YSRCP Party: ఓటర్ల జాబితాపై వైసీపీ కీలక కసరత్తు.. ఈ నెల 31న వర్క్ షాప్

1- కెప్టెన్‌గా 100వ అంతర్జాతీయ మ్యాచ్
2017లో తొలిసారిగా రోహిత్ శర్మ భారత జట్టుకు సారథ్యం వహించాడు. అప్పటికి అతను రెగ్యులర్ కెప్టెన్ కానప్పటికీ.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత రెగ్యులర్ కెప్టెన్ అయ్యాడు. భారత్ తరఫున కెప్టెన్‌గా 99 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. రేపు రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో ఆడనున్నాడు.

2- 18,000 అంతర్జాతీయ పరుగులకు కేవలం 47 పరుగుల దూరంలో
రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 17953 పరుగులు చేశాడు. 18,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి అతనికి 47 పరుగులు మాత్రమే కావాలి. రేపటి మ్యాచ్ లో 47 పరుగులు చేస్తే 18,000 పరుగులు పూర్తి అవుతాయి. అంతేకాకుండా.. అంతర్జాతీయంగా 18,000 పరుగులు చేసిన ఐదో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలుస్తాడు. రోహిత్ కంటే ముందు భారత బ్యాట్స్‌మెన్‌లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు.

3- ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు
ఇప్పటివరకు.. రోహిత్ శర్మ ప్రపంచ కప్ 2023లో 17 సిక్సర్లు కొట్టాడు. దానితో వరల్డ్ కప్ టోర్నమెంట్లో 40 సిక్సర్లు పూర్తి చేశాడు. ఇక.. 49 సిక్సర్లతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ఇంగ్లండ్ తో ఆడే మ్యాచ్ లో గేల్ రికార్డ్ ను బద్దలు కొట్టే అవకాశముంది.