Hisense E6N 65 4K Smart LED: భారత మార్కెట్లో పెద్ద సైజ్ 4K స్మార్ట్ టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హైసెన్స్ (Hisense) E6N సిరీస్ 65 అంగుళాల 4K Ultra HD Google టీవీని ఆకర్షణీయమైన ధరలో అందిస్తోంది. ఈ Hisense 65E6N మోడల్ సరికొత్త డిజైన్, ఉన్నతమైన డిస్‌ప్లే టెక్నాలజీ, మెరుగైన ఆడియో సామర్థ్యాలు, అధునాతన AI ఫీచర్లతో బడ్జెట్ విభాగంలో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. స్లిమ్, స్టైలిష్ బిల్డ్ క్వాలిటీతో ఉండే ఈ టీవీ 7.6 × 145.3 × 83.8 సెం.మీ పరిమాణంలో, 15 కిలోల బరువుతో వస్తుంది. వాల్ మౌంట్, టేబుల్ మౌంట్ రెండింటికీ అనుకూలంగా ఉండటం వల్ల యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా అమర్చుకోవచ్చు.
డిస్‌ప్లే విషయంలో ఈ టీవీ 65 అంగుళాల 4K Ultra HD LED ప్యానెల్‌తో కలిసి డాల్బీ విజన్, HDR10, HLG సపోర్ట్‌తో మెరుగైన క్వాలిటీని అందిస్తుంది. డైరెక్ట్ ఫుల్ అర్రే బ్యాక్‌లైటింగ్, ప్రెసిషన్ కలర్, 4K AI అప్ స్కేలార్, అడాప్టివ్ లైట్ సెన్సార్, MEMC వంటి ఆధునాతన టెక్నాలజీలు చిత్రాలను మరింత స్పష్టంగా, సహజంగా చూపేలా సహాయపడతాయి. 178 డిగ్రీల వైడ్ వ్యూన్ యాంగిల్, 4000:1 కాంట్రాస్ట్ రేషియో వల్ల పెద్ద హాళ్లలో కూడా క్లారిటీ తగ్గకుండా ఉంటుంది. స్పోర్ట్స్, మూవీస్, గేమింగ్ వంటి వివిధ పిక్చర్ మోడ్‌లు యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
ఈ స్మార్ట్ టీవీ పనితీరులో చూస్తే.. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తూ గూగుల్ అసిస్టెంట్, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ రిమోట్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, Disney+Hotstar, SonyLiv, జీ5, జియో సినిమా వంటి ప్రముఖ OTT యాప్స్‌కు పూర్తి సపోర్ట్ ఉంటుంది. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రోజువారీ వాడకానికి ఎలాంటి ఆటంకం కాకుండా స్మూత్ పనితీరు కలిగిస్తుంది. ఆడియో విషయంలో టీవీలో 24W ఔట్‌పుట్ కలిగిన 2.0 చానల్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆటమ్స్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ వల్ల ఆడియో ఇమర్షన్ మరింత మెరుగుపడుతుంది.
సరికొత్త అప్‌గ్రేడ్లతో Realme 16 Pro+ 5G త్వరలో లాంచ్.. స్పెసిఫికేషన్లు లీక్..!
ఇక టీవీకి బ్లూటూత్, Wi-Fi, 2 USB పోర్టులు, HDMI సపోర్ట్, ఈథర్నెట్, S/PDIF వంటి పోర్టులతో గేమింగ్ కన్సోల్, లాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, హెడ్ఫోన్స్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. Variable Refresh Rate (VRR), ALLM గేమింగ్ అనుభవాన్ని స్మూత్‌గా మార్చడంలో సహాయపడతాయి. 240V పవర్ ఇన్‌పుట్‌తో 155W వాటేజ్ వినియోగంతో పని చేసే ఈ టీవీ పెద్ద సైజ్ ఉన్నప్పటికీ పవర్ ఎఫిషియెంట్‌గా కనిపిస్తుంది. బాక్స్‌లో టీవీ యూనిట్‌తో పాటు బ్లూటూత్ రిమోట్, రెండు స్టాండ్లు, బ్యాటరీలు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అందిస్తారు. అమెజాన్‌లో ఈ Hisense 65E6N t ప్రస్తుతం రూ. 41,999 ధరతో 48% భారీ డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. రూ.79,999 ధర ఉన్న ఈ టీవీ ఇంత పెద్ద తగ్గింపు రావడం వినియోగదారులకు మంచి ప్లస్ పాయింట్. ఇక HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ EMIపై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అలాగే కొన్ని కార్డులపై రూ. 3,424 వరకు EMI ఇంటరెస్ట్ సేవింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
