NTV Telugu Site icon

Propose: మాల్‌లో తన భాగస్వామికి ప్రపోజ్.. ఎలా రియాక్ట్ అయిందంటే..!

Propose

Propose

పెళ్లికి ముందు తనకు కాబోయే భాగస్వామిని ప్రపోజ్ చేయడం చాలా ప్రత్యేకం. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. సోషల్ మీడియాలో ఇలాంటి వాటి కోసం స్పెషల్ వీడియోలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లికి ముందు మాల్ లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. అంతేకాకుండా ఆమేతో ఉన్న తన స్నేహితురాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Read Also: Sonia Gandhi: వీడియో: శ్రీనగర్‌ లో సోనియా గాంధీ బోట్ రైడ్

తనకు కాబోయే భాగస్వామిని ప్రపోజ్ చేయడానికి ఆ వ్యక్తి అదే మాల్‌కు చేరుకున్నాడు. అక్కడ అమ్మాయి తన స్నేహితులతో తిరుగుతుండగా.. వెనుక నుంచి వెళ్లి ఆమే భుజంపై చేయి వేశాడు. ఆ అమ్మాయి వెంటనే వెనక్కి తిరగగానే మోకాళ్లపైకి కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఈ సమయంలో ఆమె స్నేహితులు ఆనందంతో నవ్వుతూ, చప్పట్లు కొడుతున్నారు. మరోవైపు తన భాగస్వామి అలా ప్రపోజ్ చేయడం చూసి ఆ మహిళ.. ఎంతో సంబరపడిపోయింది. వెంటనే తాను తీసుకొచ్చిన రింగ్ తీసి మహిళ వేలుకు పెట్టి పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత మహిళ కూడా ప్రేమగా కాబోయే భర్తను కౌగిలించుకుంది.

Read Also: Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో (@pari_sachdeva_) పేరుతో పోస్ట్ చేశారు. ఆగస్టు 17న షేర్ చేసిన వీడియోను.. 84 లక్షల మంది చూశారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మాల్స్ లో ప్రపోజ్ ఏంటీ అని కొందరు అంటుంటే.. చూడటానికి సూపర్ గా ఉందని మరికొందరు రాసుకొచ్చారు.