NTV Telugu Site icon

Union Minister Giriraj Singh: హిందువులు అలాంటి మాంసం తినొద్దు..

Centrol Minister

Centrol Minister

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదు.. ఒక్క ఝట్కా ( ఒక్క వేటుతో జంతువులను చంపడం )తో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన చెప్పుకొచ్చారు. బీహార్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో ప్రజలను ఉద్దేశించి కేంద్రమంత్రి ఈ కామెంట్స్ చేశారు. హిందువుల ఆహార ఆచారాలకు కట్టుబడి ఉండాలని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.

Read Also: Salaar Release Trailer: ఎన్నిసార్లు వాయిదా వేస్తారండీ?

ఇక, హలాల్ మాంసాన్ని తినకుండా ప్రతిజ్ఞ చేయాలని తన మద్దతుదారులను కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గిరిరాజ్ సింగ్ కోరారు. కేవలం హలాల్ మాంసాన్ని మాత్రమే తినే ముస్లింలను నేను అభినందిస్తున్నాను అంటూ ఆయన చెప్పారు. ఇప్పుడు హిందువులు తమ మత సంప్రదాయాల పట్ల ఇదే విధమైన నిబద్ధతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. హిందువులు జంతుబలి ఇచ్చినప్పుడల్లా ఒకే దెబ్బతో చంపుతుంటారు.. అలాగని హిందువులు హలాల్ మాంసాన్ని తిని తమను తాము భ్రష్టు పట్టించుకోకూడదంటూ కేంద్రమంత్రి తెలిపారు. వారు ఎల్లప్పుడూ ఝట్కా మాంసం తినేందుకు కట్టుబడి ఉండాలి అని గిరిరాజ్ సింగ్ సూచించారు.

Read Also: Joe Biden Car Crash: భద్రతా వైఫల్యం.. జో బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు!

అయితే, కేవలం ఝట్కా మాంసాన్ని అమ్మేందుకు మాత్రమే రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసే కొత్త వ్యాపార నమూనా వైపు మళ్లాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాపారులను చెప్పారు. ఈ విషయంపై కొన్ని వారాల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సైతం లేఖ రాశారు.. ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లాగా హలాల్ అని లేబుల్ చేసిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలపై నిషేదం విధించాలని ఆయన వేడుకున్నారు. హిందువులు తమకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సాయంత్రం పూట దేవాలయాన్ని సందర్శించాలి అని స్థానికులకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.