Site icon NTV Telugu

Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!

Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే చావో.. రేవో.. సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు హిందూపురం లోక్‌సభ ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీ కన్నతల్లి లాంటిది.. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించటం బాధ్యతగా భావిస్తున్నాను అన్నారు. నేను పార్టీ పెద్దలు ఎవరిపై ఒత్తిడి చేయలేదేని స్పష్టం చేశారు. తాడేపల్లిలో పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాను.. నేను, సజ్జల రామకృష్ణారెడ్డితో కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. ఇక, తొందరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కల్పిస్తాం అని పెద్దలు చెప్పారని తెలిపారు. అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశారు.. ఇక్కడ తప్పించినా పార్టీ సరైన గౌరవం ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలోనే చావో, రేవో.. పార్టీ మారే ప్రసక్తే లేదు.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటాను అని ప్రకటించారు ఎంపీ గోరంట్ల మాధవ్‌.

Read Also: Sri Lanka Captain: ఎస్‌ఎల్‌సీ కీలక నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్స్!

కాగా, గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్ సభ నియోజకవర్గానికి మహిళను ఇంఛార్జ్‌గా ప్రకటించారు సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్. హిందూపురం వైసీపీ ఇంఛార్జిగా బళ్లారి బీజేపీ మాజీ ఎంపీ శాంతను నియమించారు.. ఈసారి హిందూపురం వైసీపీ అభ్యర్థిగా శాంతమ్మ పోటీ చేయబోతున్నారు. దీంతో గోరంట్ల మాధవ్ కు వైసీపీకి మొండిచేయి చూపించినట్లు అయ్యింది. ఇక, తర్వాత తనకు ఏ స్థానం కేటాయిస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రానట్టుగా తెలుస్తోంది. దీంతో.. వైసీపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్‌.

Exit mobile version