NTV Telugu Site icon

Babur Road Name Change: బాబర్ రోడ్ పేరు మార్చాలని హిందూసేన డిమాండ్

Ayodhya Marg

Ayodhya Marg

Ayodhya Marg: న్యూఢిల్లీలోని బాబర్‌ రోడ్డు పేరు మార్చాలని హిందూ సేన డిమాండ్‌ చేస్తోంది. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబర్ రోడ్ సైన్ బోర్డుపై ‘అయోధ్య మార్గ్’ అనే స్టిక్కర్‌ అంటించారు. ఈ అంశంపై హోం మంత్రిత్వ శాఖకు, ఎన్‌డీఎంసీకి పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వారు డిమాండ్ చేస్తున్నారు. బాబర్‌ మసీదు లేనప్పుడు ఢిల్లీలోని బాబర్ రోడ్డు ఎందుకని హిందూ సేన ప్రశ్నిస్తుంది.

Read Also: Guntur Kaaram: ఆ రెండు సినిమాల తర్వాత గుంటూరు కారం సినిమానే…

ఇక, ఈ రోడ్డును చూస్తుంటే నేటికీ మనం బాబర్ కాలంలోనే జీవిస్తున్నామనే భావన వస్తుందని హిందూ సేన నేతలు తెలిపారు. అందుకే దీన్ని అయోధ్య మార్గ్‌గా మార్చామని హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా పేర్కొన్నారు. బాబర్ హిందువులపై దౌర్జన్యాలు చేశాడు.. అందుకే ఈ రోడ్డు పేరును అయోధ్య మార్గ్ గా మార్చాలని కోరుతూ బాబర్ రోడ్ సైన్ బోర్డుపై హిందూ సేన స్టిక్కర్ వేసింది.. అయితే ఢిల్లీ పోలీసులు ఆ స్టిక్కర్‌ను తొలగించారు. అయితే, అయోధ్య ఆలయంలో రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో పాటు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి రైల్వే స్టేషన్‌లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.