NTV Telugu Site icon

Hindi Movie Nominated Oscar: ఆస్కార్ రేసులో మరో హిందీ సినిమా!.. కథ అదుర్స్‌

Santosh

Santosh

తాజాగా.. భారత్ నుంచి ‘లాప‌త్తా లేడీస్’ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌లో అధికారిక ప్రవేశం కానుందన్న ప్రకటన భారతీయ సినీ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచింది. బారిలో 29 సినిమాలు పోటీ పడగా ‘లాపతా లేడీస్’ అర్హత సాధించింది. ఇప్పుడు భారతీయ సినీ ప్రేమికులకు ఆనందాన్ని పంచే మరో వార్త యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) నుంచి వెలువడింది. హిందీలో నిర్మించి ‘సంతోష్’ అనే చిత్రం ఉత్తమ అంత‌ర్జాతీయ ఫిచ‌ర్ ఫిల్మ్ విభాగంలో ఈ అర్హత సాధించింది. ఈ చిత్రం యూకే నుంచి నామినేట్ చేయబడింది. బ్రిటీస్ ఇండియ‌న్ ఫిల్మ్ మేక‌ర్ సంధ్యాసూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక అవ్వడం త‌మ కృషి ఫ‌లితంగా భావిస్తున్నట్లు న‌టిగోస్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో గోస్వామితో పాటు సునీతా రాజ్ వ‌ర్ ప్రధాన పాత్ర పోషించారు.

READ MORE: YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు

సంతోష్‌ చిత్రంలో సహానా గోస్వామి, సునీతా రాజ్వార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా వెనుక బ్రిటిష్‌ నిర్మాతలు ఉండటంతో ఇది ఆస్కార్‌కు బ్రిటన్‌ నుంచి అర్హత సాధించింది. బ్రిటన్‌లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మైక్‌ గూడ్రిజ్‌, జేమ్స్‌ బోషెర్‌, బల్తాజర్‌ డే గానే, అలన్‌ మెక్అలెక్స్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. అమా అమ్‌పాడు, ఎవా యేట్స్‌, దియర్మిద్‌ స్ర్కిమ్‌షా, లూసియా హాస్‌లావుర్‌, మార్టిన్‌ గెర్హార్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు. గూడ్‌ కయోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవసరాల రీత్యా ఆంగ్లేతర సినిమాలను యూకే అప్పుడప్పుడు ఎంపిక చేస్తుంటుంది. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించారు.

READ MORE:China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?

ఈ సినిమా కథ.. ఉత్తర‌భార‌తేద‌శంలోని ఓ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగుతుంది. కొత్తగా పెళ్లైయిన ఓ మ‌హిళ సంతోష్ (గోస్వామి) కొంత కాలం త‌ర్వాత ఆమె భ‌ర్త చ‌నిపోవ‌డంతో ఒక ప్రభుత్వ ప‌థ‌కం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందుతుంది. ద‌ళిత కులానికి సంబంధించిన అమ్మాయి హ‌త్య కేసును చేధించే క్రమంలో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వచ్చాయి? అనే ఆస‌క్తిక‌ర క్రైమ్ స్టోరీ అల్లారు. వివ‌క్ష కార‌ణంగా స‌మాజంలో మ‌హిళలు ఎలా వేధించ‌బ‌డుతున్నారు? ఇలాంటి విష‌యాల‌ను సంతోష్ ఎలా వెలుగులోకి తెచ్చింది? అన్నది ఆస‌క్తిక‌రంగా మలిచారు.