NTV Telugu Site icon

Sukhvinder Singh Sukhu: హిమాచల్‌ ముఖ్యమంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

Himachal Cm

Himachal Cm

Sukhvinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా గత శుక్రవారం ఆయన సిమ్లా ఆసుపత్రిలో చేరారు. కానీ రాష్ట్రంలో ఆ రకమైన చికిత్స అందుబాటులో లేకపోవడంతో సీఎంను ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

ఆయన ఈ రోజు ఉదయం 11.20 గంటలకు అడ్మిట్ అయ్యారు. డాక్టర్ ప్రమోద్ గార్గ్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. డాక్టర్ గార్గ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి అధిపతి. డాక్టర్ ప్రకారం, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తేలికపాటి నుంచి తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ ప్రధాన మీడియా సలహాదారు నరేష్ చౌహాన్ మాట్లాడుతూ.. తాను గత చాలా రోజులుగా ప్రయాణిస్తున్నానని, ఈ సమయంలో బయటి ఆహారాన్ని తిన్నారని చెప్పారు. దీంతో సీఎంకు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు.

Also Read: Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు.. యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్..

ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన నివేదికలన్నీ సాధారణంగానే ఉన్నాయని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజిఎంసిహెచ్) అధికారులు గతంలో తెలిపారు. అనంతరం బుధవారం రాత్రి నుంచి వివిధ పరీక్షలు నిర్వహించగా కడుపులో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఐజీఎంసీ వైద్యులు గతంలో ముఖ్యమంత్రికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు.