NTV Telugu Site icon

Himachal Pradesh: మంత్రిత్వ శాఖలు కేటాయించిన సీఎం సుఖు.. ఎవరికి ఏం ఇచ్చారంటే?

Himachal Pradesh

Himachal Pradesh

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు పబ్లిక్ వర్క్స్, యువజన, క్రీడా శాఖల బాధ్యతలు ఇవ్వడంతో సహా మంత్రులకు శాఖలను కేటాయించారు. విక్రమాదిత్య సింగ్ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు. అతని తల్లి ప్రతిభా సింగ్, లోక్‌సభ నియోజకవర్గం మండి నుంచి పార్లమెంటు సభ్యురాలు.

ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్‌ సుఖు సలహా మేరకు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ శాఖలను పంపిణీ చేశారు. ఆర్థిక, హోం, ప్లానింగ్, సిబ్బంది, ఇతర ఏ ఇతర మంత్రికి కేటాయించని అన్ని శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకోగా, జలశక్తి విభాగం, రవాణా భాషా కళలు, సంస్కృతిని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రికి అప్పగించారు. సోలన్ నియోజకవర్గానికి చెందిన ధని రామ్ షాండిల్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత, కార్మిక, ఉపాధి శాఖల బాధ్యతలు అప్పగించారు. ధనిరామ్ షాండిల్ గతంలో కూడా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా చేశారు.

Extreme Cold: విపరీతమైన చలి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది..

కాంగ్రాలోని జవళి నియోజకవర్గం ఎమ్మెల్యే చందర్ కుమార్‌కు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలు.. సిర్మౌర్‌కు చెందిన హర్షవర్ధన్ చౌహాన్‌కు పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ఆయుష్ శాఖలను అప్పగించారు. గిరిజన కిన్నౌర్ జిల్లాకు చెందిన జగత్ సింగ్ నేగికి రెవెన్యూ, ఉద్యానవన, గిరిజనాభివృద్ధి శాఖలు.. సిమ్లా జిల్లాకు చెందిన రోహిత్ ఠాకూర్‌కు ఉన్నత, ప్రాథమిక, సాంకేతిక విద్య, వృత్తి, పారిశ్రామిక శిక్షణ శాఖలు లభించాయి.

డిసెంబర్ 8న జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ పోరులో మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్​ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అయితే, ఓట్ల శాతం పరంగా రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 1 శాతం కంటే తక్కువ.

Show comments