Site icon NTV Telugu

Hijras: ఛీ ఛీ.. హిజ్రాకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి

Hijras

Hijras

తమిళనాడులో ఓ అమానవీయకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మత్తు మాత్రలు ఇచ్చి ఓ హిజ్రాపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్నీ, బ్లసికాలు చెన్నైపెరంబురు ఏరియాకు చెందిన హిజ్రాలు. సోమవారం రాత్రి వీరిద్దరూ చెన్నై మధురవాయిలు హైవే రోడ్డు జీసస్ కాల్స్ దగ్గర నిలబడ్డారు. ఆదే సమయంలో అక్కడికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చారు. వారిద్దరూ మద్యం మత్తులో కాసేపు బ్లస్సికాతో మాట్లాడిన తర్వాత.. ఆమెకు హఠాత్తుగా కత్తి చూపెట్టారు.

Read Also: Leo: సితార చేతికి దళపతి సినిమా రైట్స్…

ఇద్దరు దుండగులు బ్లసికాను బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. పక్కనే ఉండి ఇది అంత చూసిన జన్నీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. దీంతో రంగంలోకి దిగిన మధురవాయిలు పోలీసులు ఎవరో ఎత్తుకెళ్లారని ఆరా తీయగా.. వెంటనే జెన్నీ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రమణి.. నిందితుల సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా సెట్టీయార్ అగరం ప్రాంతంలో బ్లెసికా ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి బ్లేసికాకు మత్తుమందు ఇచ్చారు.

Read Also: Virat Kohli 500 Match: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!

అయితే, జగన్, దినేష్ అనే ఇద్దరు మందుబాబులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు తెలిపారు. దినేష్ రామాపురానికి చెందిన వ్యక్తి కాగా, జగన్ ఆవడికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.. వారి దగ్గర నుంచి బ్లసీకాను విడిపించారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఇద్దరు పోలీసుల మీద కూడా దాడి చేసి పారిపోవడానికి ట్రై చేశారు.. కానీ వారిద్దరిని తప్పించుకోకుండా పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. మత్తులో ఉన్న బ్లెసికాను మెరుగైన చికిత్స కోసం కీలుపాక్కం హస్పటల్ కి తరలించారు.

Exit mobile version