NTV Telugu Site icon

Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ హైలెట్స్ ఇవే

Budjet

Budjet

Union Budget 2025 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సారి వ్యవసాయం, రైతులు, ఎమ్ఎస్ఎంఈలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మధ్య తరగతి వేతన జీవులను భారీ ఊరటనిచ్చే విధంగా ఆదాయపు పన్ను పరిమితిని రూ.12లక్షలకు పెంచింది. ఈరోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో హైలెట్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

* క్లీన్‍టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
* పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్
* రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
* వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు
* దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
* సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు
* జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం
* ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు
* రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు
* పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
* 8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0
* దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‍ల ఏర్పాటు
* పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
* బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
* కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
* పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు. ఇది 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
* ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్రమంత్రి
* దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం

Read Also:Union Budget 2025: భారత విద్యా వ్యవస్థలో AI విప్లవం.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు

* గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన. ఇది 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి.
* ఎంఎస్‌ఎంఈలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
* స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
* బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం
* అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్‌
* 2024 జులై నుంచి వందకుపైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
* పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్‌
* పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్‌
* రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు కోట్ల రుణాలు
* 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు
* సంస్కరణల అమలు చేస్తే ప్రోత్సాహకాలు
* గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు
* ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద నమోదు
* కోటి మంది గిగ్‌ వర్కర్లకు పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన

Read Also:New Income Tax Slabs: కొత్త ఆదాయపన్ను శ్లాబులు ఇవే.. ఇంత ఆదాయం ఉన్నవారికి బిగ్ రిలీఫ్!

* ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
* ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు
* 27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ
* నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు
* సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
* ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఏర్పాటు
* BNS స్పూర్తితో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తాం
* లిటిగేషన్లను తగ్గించేలా ఇన్‌కమ్‌ ట్యాక్స్ విధానం
* మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత పన్ను విధానం
* సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంపు
* అప్‌డేటెడ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్ నమోదుకు నాలుగేళ్లు పొడిగింపు
* ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం FDIలకు అనుమతి