ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు మాజీ మున్సిపల్ చైర్మన్ బసవ రేవతి.. నూజివీడు గురుదత్త ఆశ్రమం వద్ద 2 ఎకరాల 79 సెంట్లు స్థలం విషయంలో వివాదం చెలరేగింది. దీంతో బసవ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బసవ కుటుంబ సభ్యులకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న వారిని అరెస్ట్ చేశారంటూ ఆందోళనకు దిగారు వైఎస్సార్సీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ బసవా రేవతి. నూజివీడు స్టేషన్ ఖాళీ లేకపోవడంతో వీరిని అరెస్ట్ చేసి ఇక్కడకు తరలించారా అంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
Read ALso: Sunil Gavaskar: అతడు కెప్టెన్‌గా ధోనీ మాదిరే ఉంటాడు.. ఆ క్రికెటర్‌పై గవాస్కర్ ప్రశంసలు
ఆందోళన చేస్తున్న ఆమె వద్ద మీడియా వారు వివరణ తీసుకుంటున్న తరుణంలో దురుసుగా ప్రవర్తించారు నూజివీడు పట్టణ ఇన్ ఛార్జి సీఐ సత్యనారాయణ ….మీడియాతో తీవ్ర వాగ్వాదానికి దిగిన పట్టణ ఇన్ ఛార్జి సిఐ సత్యనారాయణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంలో పోలీసులు అతిగా జోక్యం చేసుకుని నా బిడ్డలను అక్రమ అరెస్ట్ చేశారంటూ బసవా రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.
Read Also: #Nani30: నాని చిత్రంలో శ్రుతిహాసన్!
