NTV Telugu Site icon

YCP vs TDP: ఏపీలో పలు చోట్ల టీడీపీ- వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. పోలీసులు అలర్ట్

Tdp Vs Ycp

Tdp Vs Ycp

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో టీడీపీ- వైసీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.. అయినా, పలు చోట్ల ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి.

Read Also: Shobha Karandlaje: తమిళనాడుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్రమంత్రిపై చర్యలకు ఈసీ ఆదేశం..

తాజాగా, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడుకి సంబంధించిన కేవీఆర్ సూపర్ మార్ట్ లో భారీ మొత్తంలో చీరలు ఉన్నాయని ఎన్నికల అధికారికి టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. కేవీఆర్ సూపర్ మార్కెట్లో అధికారులు తనిఖీ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక, మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించని వైసీపీ కీలక నాయకుడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: R. Krishnaiah: జగన్ను మరో రెండుసార్లు గెలిపించుకోవాలి..

అలాగే, గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని నల్లపాడు పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత జరిగింది. వాలంటీర్లతో వైసీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ సమావేశం అయ్యాడు.. వారికి కానుకలు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా పని చేయాలని చెప్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గుంటూరు కార్యాలయానికి వాలంటీర్లు రావడంతో.. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులువైసిపి కార్యాలయానికి వెళ్లి సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడంటూ రామాంజనేయులు వాహనంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. వైసీపీ దాడిపై ఫిర్యాదుకు నల్లపాడు పోలీసుస్టేషన్‍కు టీడీపీ నేత రామాంజనేయులు వెళ్లారు. ఇక, టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లారు. దీంతో పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.