High Tension in Tadipatri: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్ల దాడికి ప్రయత్నించారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేత సూర్యముని ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో సీఐకి గాయాలయ్యాయి. రాయలసీమలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన తాడిపత్రి ఎన్నికల ప్రారంభం నుంచి రావణ కాష్టంలా రగులుతుంది. అడుగడుగున వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు.
Read Also: Chandrababu: మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో మాట్లాడిన చంద్రబాబు