Varahi Yatra: జగదాంబ జంక్షన్ లో కిక్కిరిసిన జనసైనికులు.. సభకు వెళ్లే మార్గంలో తొక్కిసలాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడవ విడత వారాహి యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కాసేపట్లో వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారాహి యాత్ర కోసం జనసైనికులు భారీగా తరలివచ్చారు. దీంతో జగదాంబ జంక్షన్ జనసంద్రంగా మారడంతో.. ఆ ప్రాంతమంతా జనసైనికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు సభా ప్రాంగణానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Karnataka: వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం రాయితీ
Also Read
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Allu Arjun - Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
మరోవైపు వారాహి యాత్ర బహిరంగ సభకు వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు బారికేడ్లు దాటుకుని వెళ్లే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు రోడ్డుపై పడిపోయారు. వారాహి సభకు వెళ్లే కార్యకర్తలు, అభిమానులను జడ్జి కోర్టు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో సభకు వెళ్ళేందుకు వచ్చిన వందల మంది జనసైనికులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు లాఠీలు జులిపించారు. సభకు వచ్చిన జనసైనికులు.. సభకు వెళ్ళనివ్వాలిసిందేనని పట్టుబడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. పోలీసులు సభ ప్రాంగణం వద్ద నిలబడేందుకు చోటు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
-
NTV Exclusive: త్వరలోనే ‘మెగా పోడ్కాస్ట్’.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ రైటర్‌తో చిరంజీవి బిగ్ ప్లాన్!
-
Allu Arjun – Venkatesh Iyer: ఐకాన్ స్టార్ ను కలిసిన వెంకటేశ్ అయ్యర్.. అల్లు అయాన్ కు స్పెషల్ గిఫ్ట్..!
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!