NTV Telugu Site icon

Huzurabad: హుజూరాబాద్ లో హైటెన్షన్.. నేతల హౌస్ అరెస్ట్.. కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్

New Project (22)

New Project (22)

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ – బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా మంగళ వారం ఉదయం గుడి వద్ద ప్రమాణం చేయాలి అని ఛాలెంజ్ చేసుకుని సిద్ధపడ్డ తరుణంలో రాత్రికి రాత్రే కౌశిక్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని, మానుకోటలో రాళ్ళు విసిరిన ద్రోహి అంటూ పోస్టర్లు వెలువడం చర్చనీయాంశంగా మారింది.

READ MORE: AAY : ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గం మీదుగా ఖమ్మంకు ఫ్లై యాష్ అధికలోడుతో వే బిల్లులు లేకుండా మంత్రి పొన్నం అండదండల మంత్రి కోట్లు సంపాది స్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నం పై ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఎమ్మేల్యే కాకముందు ఉద్యోగులు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తానని ప్రకటన చేశారు. దీంతో అలార్ట్ అయిన పోలీసులు చెల్పూర్ లో ఏర్పాటు చేసిన టెంట్ ఫ్లెక్సీలను తొలగించి ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి. ప్రణవ్ ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు.

READ MORE: Ponnam Prabhakar: ఆషాఢ మాసం బోనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. అన్ని సదుపాయాలకు రూ.20కోట్లు

వాళ్ళను హౌస్ అరెస్ట్ చేశారు. ఆలయం వద్దకు వచ్చేందుకు యత్నించిన ఇరు పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. తడి బట్టలతో తాను అవినీతి చేయలేదని కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.100 కోట్ల అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలన్నారు. తాను అవినీతి చేయలేదని దేవుడిపై ప్రమాణం చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫ్లైయాష్‌తో పాటు ఓవర్ లోడ్ లారీలను ఎందుకు ఆపడం లేదన్నారు.