NTV Telugu Site icon

Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్

Pinnelli

Pinnelli

Palnadu: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడుతో టెన్షన్ కొనసాగుతోంది. నరసరావు పేటలో పిన్నెల్లి ఉంటున్న గృహం చుట్టూ పోలీసులు మోహరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సంతకం చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరోవైపు పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాలను బట్టి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసుల్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాల్టి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 106వ నంబర్ గా ఉన్న పిన్నెల్లి పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ విచారించనుంది. ప్రస్తుతం 88వ నంబర్ పిటిషన్ వెకేషన్ బెంచ్ విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు శుక్రవారం పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పల్నాడు జిల్లాలో ఏం జరుగుతుందనే ఆసక్తి, టెన్షన్ అక్కడి ప్రజల్లో నెలకొంది.

Read Also: Chandrababu: ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని సూచించింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఈ క్రమంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే ఉండాలని, ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి నిత్యం సమాచారం ఇవ్వాలని సూచించింది. దేశం దాటి వెళ్లొద్దని, గురజాల మేజిస్ట్రేట్‌ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. జిల్లాలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి సూచించింది. అనుచరులను నియంత్రించే బాధ్యత పిన్నెల్లి తీసుకోవాలని తేల్చిచెప్పింది.