ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. జాయింట్ సీపీకిఫిర్యాదు చేశారు. సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదు రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దాడికి సహకరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశ పూర్వకంగా పోలీసులు దగ్గరుండి చేయించిన దాడి ఇది అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు.. పదేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధి అంటేనే ప్రశాంత వాతావరణం ఉండేది.. ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లా కొంటున్నారని అన్నారు.
Danam Nagender: కౌశిక్‌రెడ్డికి దానం వార్నింగ్.. స్థాయి తెలుసుకోవాలని హెచ్చరిక
త్వరలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేపడతాం.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పని చెప్పాల్సిన రాహుల్ గాంధీ ఈ పద్ధతిని ప్రోత్సహిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. నల్గొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేస్తే అరెస్ట్ చేయలేదు.. ఖమ్మంలో తనతోపాటు ఎమ్మెల్యేల బృందం పై దాడి చేస్తే.. ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఈరోజు కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన గాంధీని.. నార్సింగ్ పీఎస్ లో కూర్చోపెట్టి రాచమర్యాధాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిర్యానీలు, టీ, కాఫీలు అందిస్తున్నారన్నారు. 30 మంది గూండాలను ఆపే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు లేదా…? అని హరీష్ రావు ప్రశ్నించారు. కావాలనే ఆ 30 మందిని పోలీసులు ప్రోత్సహించి కౌశిక్ రెడ్డి పై దాడికి ప్రోత్సహించారని తెలిపారు. కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు.. గాంధీని హౌజ్ అరెస్ట్ చేయలేరా అని ప్రశ్నించారు. సీపీకి ఎప్పటికప్పుడు ఫోన్ లో తాను చెప్తూనే ఉన్నాను.. పరిస్థితి వివరించాను.. అయినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.
CM Chandrababu: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు
గాంధీకి కాన్వాయ్ ఇచ్చి మరీ.. కౌశిక్ రెడ్డి ఇంటి వైపు పోలీసులు పంపారు.. సైబరాబాద్ పోలీసులు కూడా సీఎం రేవంత్ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తమ ఎమ్మెల్యేల కార్లను కూడా గేటు బయట ఆపారు.. నడుచుకుంటూ లోపలికి రమ్మన్నారు.. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు సైబరాబాద్ సీపీ ఆఫీస్ లోనే ఉంటామని పట్టుపట్టుకుని కూర్చున్నారు. గాంధీతో పాటు.. కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదని చెబుతున్నారు. మీ పని మీరు చేసుకోండి.. తాము బయట కూర్చుంటాం అని జయింట్ సీపీకి చెప్పామన్నారు. గాంధీతో పాటు అనుచరుల పై 307 కింద కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అవసరమైతే సీబీఐ విచారణ చేయాలి.. అరెస్టు చేయకుంటే కోర్టుకు వెళ్తామని అన్నారు. సైబరాబాద్ సీపీతో ఉదయం నుండి 3 సార్లు ఫోన్ లో మాట్లాడాను.. తాను యాక్షన్ తీసుకుంటా అని ఫోన్ కాల్ లో చెప్పాడన్నారు. ఉదయం నుండి జరుగుతున్న వ్యవహరం సీపీకి తెలియదా..? అని ప్రశ్నించారు.