NTV Telugu Site icon

High Court: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వాయిదా..

Chennamaneni

Chennamaneni

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్ పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అయితే.. నేడు తీర్పు వెలువడుతుందని అనుకున్నప్పటికీ.., తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో.. ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేసారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే.. ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని న్యాయవాది తెలిపారు. పాస్‌పోర్ట్ ప్రామాణికం కాదని చెన్నమనేని తరపు న్యాయవాది తెలిపారు.

Read Also: Bulldozer Action: బహ్రైచ్ నిందితులపై బుల్డోజర్ యాక్షన్.. యోగి సర్కార్‌కి సుప్రీంకోర్టు వార్నింగ్..

మరోవైపు.. ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ క్రమంలో.. లేదని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో.. అన్ని వాదనలు పరిగణలోకి తీసుకున్నామని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Read Also: Uranium In Water: ఛత్తీస్‌గఢ్ 6 జిల్లాల్లో నీటిలో ప్రమాదకర స్థాయిలో ‘‘యురేనియం’’