Site icon NTV Telugu

Sunil Kanugolu : నేడు సునీల్ కనుగోలు పిటిషన్‌పై తీర్పు ప్రకటించనున్న హైకోర్టు

Telangana Highcourt

Telangana Highcourt

అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో ఇటీవల సైబర్‌ క్రైం పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యహకర్త సునీల్ కనుగోలుకు 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సునీల్‌ కొనుగోలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. సునీల్‌ పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. తన పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు సునీల్‌ కొనుగోలు. పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు గడువు కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్ రాశారు.

Also Read : Guntur Stampede: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!
ఈలోపు నోటీస్‌ను కొట్టేవేయలంటూ పిటిషన్ వేశారు సునీల్‌ కొనుగోలు. అయితే.. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును జనవరి 2, 2023కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు సునీల్‌ కొనుగోలు పిటిషన్‌పై తీర్పును వెలువరించనుంది హైకోర్టు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ తో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ కారణంగా ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలని కోరారు సునీల్‌. వీడియో స్పూఫ్ లకు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదని, ఎఫ్ఐఆర్‌లో సునీలు కనుగోలు పేరును తొలగించాలని సునీల్‌ తరుఫు న్యాయవాది హైకోర్టును కోరారు.
Also Read : Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Exit mobile version