Site icon NTV Telugu

Drug Party Case: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో పబ్ యజమానలకు షాక్..

Drugs

Drugs

మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది. దీంతో వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేరొన్నాడు. క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయాలని పబ్ యజమానులు హైకోర్టుకు వెళ్లారు. ఈ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది..

READ MORE: INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు, బయటకు వచ్చిన ఆప్..

Exit mobile version