Relief For Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. 25వరకూ అరెస్ట్ వద్దన్న హైకోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. వైఎస్ అవినాష్ రెడ్డి (Mp AvinashReddy) ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అవినాష్ కి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఇదిలావుండగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అవినాష్ ని విచారిస్తామన్న సీబీఐ విచారణ రేపటికి వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ రెడ్డిని విచారిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
Read Also: BRS Ministers: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ ఉత్సవాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 వరకు ప్రతి రోజూ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని, సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్ట్ ఆదేశించింది. అవినాష్ విచారణ ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. ఈనెల 25న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వాళ్ళిద్దరితో కలిపి అవినాష్‌రెడ్డిని ప్రశ్నిస్తామని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.
ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌పై ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ డేటాపై ఆధారపడటం తగదు. సునీల్ యాదవ్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయి. దస్తగిరి చెప్పింది తప్పా? గూగుల్ డేటా తప్పా? కుటుంబ, ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలే వివేకా హత్యకు కారణమై ఉండొచ్చు. బంధువు కాబట్టి హత్యా స్థలికి వెంటనే వెళ్లాం. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదు’’ అని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే అదే విషయం చెప్పారని అవినాష్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. అవినాష్‌రెడ్డి, సునీత, సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం ఈనెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ముందస్తు బెయిల్ పై ఏర్పడిన ఉత్కంఠ వీడిపోయింది.
Read Also: AP CS Jawahar Reddy: విభజన అంశాలపై రేపు ఢిల్లీలో భేటీ
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!