Site icon NTV Telugu

PCB Chairman Elections: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బలూచిస్తాన్ హైకోర్టు షాక్..

Pcb Board

Pcb Board

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల కావడంతో క్రికెట్‌ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో పీసీబీ చైర్మన్‌కు సంబంధించి ఎన్నికపై బలూచిస్తాన్‌ హైకోర్టు స్టే విధించింది. జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంది.

Read Also: PM Modi: విపక్షాలు భయపడుతున్నాయి.. వారిని చూస్తే జాలేస్తోంది..

2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్‌ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎలక్షన్స్ నిలిపివేయాలని బలూచిస్తాన్ హైకోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్‌ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు ఇచ్చింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్‌కు అందరు హాజరవ్వాలని చెప్పింది. అయితే పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్‌ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్‌ వస్తేనే పీసీబీ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్‌ బాడీ ప్రాసెస్‌ను మొత్తం క్యాన్సిల్ చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది.

Read Also: Rakesh Master Last Video: చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ రికార్డు చేసిన సెల్ఫి వీడియో!

వాస్తవానికి పీసీబీ గవర్నింగ్‌ బాడీ పది మంది పాలకవర్గంతో కూడి ఉంటుంది. ఇందులో ఇద్దరు పాక్ ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులుంటారు. వీరందరు కలిసి కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్‌ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో​ ఉంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్‌ మూడేళ్లు ఆ పదవిలో కొనసాగుతారు.

Read Also: Etala Jamuna: పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదు

అయితే, ఇవాళ విడుదలైన వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌కు సంబంధించి పాకిస్తాన్‌ తన మ్యాచ్‌లన్నీ దక్షిణ భారత్ లో ఆడనుండగా.. భారత్‌తో మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడనుంది. అక్టోబర్‌ 15న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి పాక్- భారత్‌తో మ్యాచ్‌ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్‌కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్‌లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని తెలిపింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఐసీసీ ఓటు వేసింది. దీంతో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేలా షెడ్యూల్‌ రిలీజ్ అయింది.

Exit mobile version