ఎమ్మెల్యే కొనుగోలు కేసుల్లో జడ్జ్ మెంట్ లో కీలక విషయాలు ప్రస్తావించింది హైకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న హైకోర్టు.. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయిందని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికి చెప్పకూడదని, దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫెర్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించలేదు.
Also Read : Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని, బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో పిటిషన్ డిస్మిస్ అయ్యిందని తెలిపింది. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎఫ్ ఐ ఆర్ 455/2022 సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. సిట్ చేసిన దర్యాప్తు రద్దు చేస్తున్నట్లు, 26 కేసుల జడ్జిమెంట్లను కోడ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసును కోర్టు ప్రస్తావించింది. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపెడుతూ జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. సీఎం ప్రెస్ మీట్ ను కూడా ఆర్డర్ లో మెన్షన్ చేసిన హై కోర్టు.. కోర్ట్ ఆర్డర్ లో సిట్ ఉనికిని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని, కోర్టుకి ఇవ్వలసిన డాక్యుమెంట్స్ ని పబ్లిక్ చేసారని మండిపడింది.
High Court : ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయింది

Telangana Highcourt