Site icon NTV Telugu

Group-1: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు..

Tg High Court Jobs

Tg High Court Jobs

గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్.. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.

Also Read:Srisailam Temple Ghee Controversy: శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా..? కొత్త అనుమానాలు

ప్రభుత్వం, TGPSCకి, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అప్పీల్‌ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టివేసిన డివిజన్‌ బెంచ్‌.. గ్రూప్‌-1 నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది.. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవు అని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గతేడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.

Also Read:Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?

పరీక్షల్లో జెల్‌ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్‌ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించింది

Exit mobile version