Site icon NTV Telugu

Gudivada Amarnath: మంత్రి గుడివాడ సీటుపై అధిష్టానం క్లారిటీ.. అక్కడి నుంచి పోటీ..!

Amarnath

Amarnath

Gudivada Amarnath: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తులు చేస్తుండగా.. పార్టీ గెలవలేని చోట గెలిచే అభ్యర్థిని ఖరారు చేస్తుంది అధిష్టానం. ఈ క్రమంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడో తెలిపింది. అతని సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు. పెందుర్తిలో కాపు, వెలమ ఓట్లు ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది హై కమాండ్.

Read Also: YSRCP: ముగిసిన నర్సరావుపేట పంచాయతీ..

గతంలో పెందుర్తి ఎమ్మెల్యేలుగా అమర్నాథ్ తాత, తండ్రి పనిచేశారు. అయితే పెందుర్తి నుంచి పోటీ చేస్తాడా అనేది మూడో జాబితాలో తెలియనుంది. ఇదిలా ఉంటే.. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు ఈసారి సీటు ఇచ్చే ఆలోచనలో పార్టీ లేనట్లు తెలుస్తోంది. యలమంచిలి, చోడవరం నియోజకవర్గాలను కూడా పరిశీలించిన అధిష్టానం.. చివరకు అమర్నాథ్ కు పెందుర్తి నియోజకవర్గం ఖరారు చేసింది.

Read Also: India-Maldives row: ఇండియా-మాల్దీవ్స్ వివాదం మధ్యలో “ఇజ్రాయిల్”.. లక్షద్వీప్‌ గురించి కీలక ప్రకటన..

Exit mobile version