NTV Telugu Site icon

SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్‌ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా..

Spy Camera

Spy Camera

SPY Camera in Engineering College womens Washrooms: సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే నిజంగా పరిస్థితి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భావించకుండా ఉండలేకపోతున్నాము. ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భూమ్మీద గౌరవంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం షాక్‌కు గురైంది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయినా పరిస్థితి మారడం లేదు. ఈ ఘటన తర్వాత కూడా మహిళలపై హింస తగ్గడం లేదు, వేధింపులు తగ్గడం లేదు.

ఇకపోతే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. యూనివర్శిటీల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికల టాయిలెట్స్‌లో విద్యార్థులు రహస్య కెమెరాను కనుగొన్నారు. కొందరు దుండగులు మహిళల టాయిలెట్స్‌లో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటనపై వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే యాజమాన్యం స్పందించక పోవడంతో పాటు నిందితుడిని వెంటనే శిక్షించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఇలాంటి దారుణ ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం యూనివర్శిటీ క్యాంపస్‌ లో మాకు న్యాయం కావాలి అని నినాదాలు చేసారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. దీంతో మీడియాకు సమాచారం రాకుండా యూనివర్సిటీ గేట్లను మూసివేశారు.

సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిల నినాదాలు చేసారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నం చేసారు. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు పోలీసులు. ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగిదింది హైడ్రామా. ఈ ఘటనలో ఫైనల్ ఇయర్ విద్యార్థికు, మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపనలు వినిపిస్తున్నాయి. బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ. ‘ ఎక్స్ ‘ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను విద్యార్థినీలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.

Show comments