నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.’హాయ్ నాన్న’ సినిమాకు మ్యూజిక్‍తోనే హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.అందుకే మూవీ రిలీజ్‍కు చాలా రోజుల ముందు నుంచే పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు.. మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషమ్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా హాయ్ నాన్న సినిమా నుంచి మూడో పాట రిలీజ్‍కు డేట్ ఫిక్స్ అయింది.హాయ్ నాన్న మూవీ నుంచి తెలుగులో ‘అమ్మాడి’ పేరుతో మూడో పాట వస్తోంది. నవంబర్ 4వ తేదీన ఈ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. హిందీలో ప్యారా లాగే, తమిళంలో మైయాల్, కన్నడలో అంధాజూ అలాగే మలయాళంలో మెల్లే ఇష్టం పేర్లతో ఈ మూడో పాట రానుంది. ఈ విషయాన్ని హాయ్ నాన్న సినిమా నిర్మిస్తున్న వైరా క్రియేషన్స్ నేడు (అక్టోబర్ 30) వెల్లడించింది.
నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రొమాంటిక్‍గా హగ్ చేసుకున్న పోస్టర్‌ను మేకర్స్ పోస్ట్ చేశారు. హాయ్ నాన్న చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇటీవలే ప్రకటించింది. సలార్ సినిమా కారణంగా డిసెంబర్ 21 నుంచి ఈ మూవీ విడుదల తేదీ ముందుకు వచ్చింది.హాయ్ నాన్న సినిమా నుంచి ఇప్పటికే సమయమా, గాజుబొమ్మ అంటూ రెండు పాటలు విడుదల అయ్యాయి.. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సమయమా సాంగ్ బాగా పాపులర్ అయింది. ఖుషి సినిమాకు రిలీజ్‍కు ముందే తన పాటలతోనే హైప్ తెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇప్పుడు హాయ్ నాన్న విషయంలో కూడా అదే రిపీట్ చేస్తున్నారు.హాయ్ నాన్న సినిమాలో బేబి కియారా ఖన్నా నాని కూతురి పాత్ర పోషించింది.. అలాగే జయరామ్, అంగద్ బేడీ ఈ చిత్రంలో కముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.వైరా ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.