NTV Telugu Site icon

Underwear : డ్రాయర్ ఉతక్కుండా మళ్లీ మళ్లీ వేసుకుంటున్నారా.. మీరు డేంజర్లో పడ్డట్లే

New Project (100)

New Project (100)

Underwear : ఏంటి పైన హెడ్డింగు చూసి నవ్వుకుంటున్నారా. మీరు నవ్వుకున్న.. తిట్టుకున్న.. ఇదే నిజం అంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా కొంతమంది బ్యాచ్ లర్స్ హాస్టల్లో ఉండే పిల్లలు కొన్ని కారణాల చేతనో లేకపోతే బద్ధకం వల్లో కానీ వేసుకున్న అండర్ వేర్ ని ఉతక్కుండానే మళ్లీ మళ్లీ తిప్పి వేసుకుంటూ ఉంటారు. ఇది చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే అలా వేసుకున్న డ్రాయర్ ను ఉతక్కుండా పదేపదే వేసుకోవడం వల్ల చాలా చాలా ఇన్ఫెక్షన్స్ సోకుతాయట.

Read Also:Finger Ring Missing Case: వేలి రింగ్‌ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సీఐని ఏ2గా చేర్చాలని కోర్టు ఆదేశాలు..

అవి కాస్త పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయట. అందుకే అలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు డాక్టర్లు. నిజానికి ప్రతి ఎనిమిది గంటలకు.. ఒకసారి అండర్ వేర్ ని మార్చుకోవడం ఉత్తమమైన లక్షణం . కానీ ఆఫీసులకు వెళ్లే వాళ్లు, ఉద్యోగాలు చేసేవాళ్లు, వేరే పని మీద బయటకు వెళ్లే వాళ్లు అలా చేసుకోవడం కుదరకు. కాబట్టి కనీసం రోజుకు ఒక్కసారైనా సరే అండర్ వేర్ ని నీటుగా వాష్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.

Read Also:Komatireddy Venkat Reddy: అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నా..

అంతేకాదు రాత్రి సమయంలో అండర్ వేర్ వేసుకోకుండా ఉండడమే మంచిది అంటూ కూడా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఎవరైతే హాస్టల్ పిల్లలు ఒకటే డ్రాయర్ తిప్పి తిప్పి మార్చి మార్చి వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు త్వరగా ప్రైవేట్ పార్టుల్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయట. అవి పెద్ద సమస్యలకు కూడా దారి తీస్తాయట. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అంటున్నారు వైద్యులు.. ఇకనైనా.. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్లు ఆ తప్పు చేయకుండా సింపుల్ గా ఎవరి అండర్ వేర్ వాళ్లు ప్రతిరోజు ఉతుక్కుని బాగా ఆరిన తర్వాత వేసుకోవడం మంచిది. అలాగే డ్రాయర్లకు ఆర్నెళ్ల కంటే ఎక్కువ కూడా వాడొద్దని చెబుతున్నారు డాక్టర్లు.