NTV Telugu Site icon

Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు

Heroine Samyukta

Heroine Samyukta

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నేడు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త పాల్గొంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటుంది. బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమంలో సంయుక్త మాట్లాడింది. అవగాహన కార్యక్రమానికి హాజరు ప్రచారం చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా హాజరైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సంయుక్త తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా షేర్ చేసింది.

READ MORE: Gold Prices: ఏడాదిలో 35 సార్లు ఆల్ టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర..

ఈ కార్యక్రమం గురించి సంయుక్త స్పందిస్తూ.. “బసవతారకం ఆస్పత్రి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాకథాన్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాటంలో మనమంతా ముందుకు రావాలి. ఈ ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ తీసుకురావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ను డిటెక్ట్ చేస్తే చికిత్సతో నయం చేయడానికి వీలు ఉంటుంది. మనమంతా ఈ అవేర్ నెస్ లో భాగమవుదాం.” అని పేర్కొంది.

READ MORE: Film Chamber Committee: ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా మంత్రి

Show comments