Site icon NTV Telugu

Rashi Khanna: సౌత్ ఇండస్ట్రీపై మనస్సు చంపుకోలేపోతున్న ఢిల్లీ బ్యూటీ

Rasi Khanna

Rasi Khanna

Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో నాగ శౌర్యతో కలిసిన చేసిన క్యూట్ లవ్ స్టోరీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె పేరుకు ఢిల్లీ అమ్మాయి కానీ.. నిజానికి సొంతమ్మాయిగానే చూశారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు కుర్రహీరోలతో జత కట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు. అయితే, రాశీ మాత్రం ఇక్కడ ఆడియన్స్‌ను దూరం అవుతోందని అనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కారణాలు చూస్తే..

Also Read: Natural Star Nani: మాలీవుడ్‌‭ను టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్.. స్పీడ్ ఎక్కువైందా?

హీరోయిన్ రాశిఖన్నా.. టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి రెండేళ్లు కావస్తోంది. ‘థాంక్యూ’ సినిమా తర్వాత టాలీవుడ్ కు కనిపించని ఆవిడ.. బాలీవుడ్ ప్రాజెక్టులతో అక్కడ బిజీ అయ్యింది. బాలీవుడ్ లో ఈ ఏడాది యోధా, రీసెంట్లీ సబర్మతీ రిపోర్టు అనే రెండు ప్రాజెక్టులతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యోధా సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్ అవ్వగా, సబర్మతి రిపోర్ట్ మిక్స్ డ్ టాక్ ను అందుకుంది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన సబర్మతి రిపోర్ట్ సినిమాలో జర్నలిస్టుగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసిన రాశీ.. సినిమాను సౌత్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు చిత్ర యూనిట్. నిజానికి రాశీ ఖన్నాకు సౌత్ సినిమాస్ లో మంచి మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉన్నవిషయం తెలిసిందే. అయితే దీన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. సరైన ప్రమోషన్స్ చేయకపోవడంతో.. ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్లపై కనపడింది.

Also Read: Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..

ఇక మరోవైపు, టాలీవుడ్ ఆడియన్స్ ను మర్చిపోయిందా అంటే.. అది లేదు. వీలు చిక్కినప్పుడల్లా టాలీవుడ్ ఇండస్ట్రీను పొగిడేస్తుంది. ఇక్కడి ఫ్యాన్స్ వేరె లెవల్ అని చెబుతూ, సినిమాలే ప్రపంచంగా బతికేస్తారని, అలాంటి ఫ్యాన్స్ సౌత్ అందులోనూ తెలుగులో ఉంటారని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే.. బాలీవుడ్‌లో ఫోకస్ పెంచింది కానీ, సదరన్ సినిమాలు అలాగే ఆడియన్స్ పై ఈ బ్యూటీ మనసు చంపుకోలేపోతుందని అర్థమవుతోంది. కానీ, సౌత్‌లో ఒకటి రెండు చిత్రాలతో మాత్రమే టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ఒక్క తెలుగు మూవీ మాత్రమే ఉంది. సిద్దు జొన్నలగడ్డతో లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ‘తెలుసు కదా’లో చేస్తోంది.

Exit mobile version