తెలుగు వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో శనివారం నాడు హైదరాబాద్ లో ఏప్రిల్ 26న విడుదల కాబోతున్న ‘రత్నం’ సినిమా సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ల భాగంగా సినిమా విశేషాలతో పాటు కాస్త రాజకీయపరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు హీరో విశాల్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి..’ మీరు ఈ మధ్య కాంట్రవర్సీలలో ఎక్కువగా ఉంటున్నారని, సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఇలా ఉండడంతో ఎవరు సపోర్టుగా మీకు మాట్లాడట్లేదని’ అడగగా.. అందుకు హీరో విశాల్ స్పందిస్తూ..
Also read: Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ డబల్ టాక్సేషన్ జరుగుతోంది. ఈ విషయాన్ని అక్కడ ఎవరు అడగడానికి ధైర్యం సరిపోవట్లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై ఏకంగా ప్రధానమంత్రి మోడీని, అలాగే తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలై ను ఈ విషయం అడుగుతున్నానని.. మీరు ఎందుకు ఊరికే ఉన్నారు అంటూ ప్రశ్నించాడు. దేశమంతా వన్ నేషన్, వన్ టాక్స్ పద్ధతిని తీసుకోవచ్చారు.. కాకపోతే., తమిళనాడు మాత్రం జిఎస్టి తోపాటు లోకల్ బాడీ టాక్స్ కూడా గత ఏడేళ్ల నుంచి కడుతున్నట్లు విషయాలు తెలిపారు. మరి ఈ విషయం గురించి మీరు చూడండి. నేను ఇలా మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది., నాకు పెళ్ళాం పిల్లలు అంటూ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది వేరే వాళ్ళందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి అందుకే వారు మాట్లాడడం లేదు అంటూ తెలిపాడు..
Also read: Avesham: 100 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మలయాళ సినిమా..
తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని., మా అమ్మ కూడా ఓసారి ఫోన్ చేసి బెదిరించారని.. కాకపోతే., మా అమ్మ కూడా వాళ్లకి ధైర్యంగా సమాధానం చెప్పడంతో ఏం చేయలేకపోయారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కార్యక్రమంలో తాను ఈ మధ్య కార్లు వాడటం మానేశానని ఈమధ్య తమిళనాడు రాష్ట్రంలో రోడ్ల వల్ల రెగ్యులర్ గా కార్లు రిపేర్ అవుతున్నాయని.. వాటి ఖర్చు ప్రతిసారి లక్షల్లో బిల్లు అవుతుందని చెబుతూ.. ఈమధ్య తన దగ్గర ఉన్న కార్లన్నీ అమ్మేసి ఓ మంచి సైకిల్ కొనుక్కున్నాను అంటూ తెలిపాడు. తాజాగా తమిళనాడులో జరగబోయే 2026 ఎన్నికల్లో తాను కూడా ఓ కొత్త పార్టీ పెట్టి పోటీకి రాబోతున్నట్లు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
