Site icon NTV Telugu

Vishal: అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలి.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు..

Vishal

Vishal

Vishal: తమిళ హీరో విశాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారు.. అలాంటప్పుడు ఆ మహిళలు ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని., తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని., అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన మాట్లాడారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. కేరళలో అలా ఆడవాళ్లను వేదించిన పాపానికి వారికి శిక్ష పడాల్సిందే. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి మగవారిపై ఉంటుంది. శ్రీ రెడ్డి ఎవరో నాకు తెలియదు కానీ‌.. ఆమె పై వేసే జోకులు మాత్రం నేను విన్నానని ఆయన అన్నారు.

Goodachari 2: ఈసారి అంతకు మించి అంటున్న అడివి శేష్..

ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని., నిజంగానే ఇబ్బందులు కలిగితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు. ఇకపోతే ఆయన రత్నం సినిమాతో సినీ ప్రేక్షకుల ముదిరికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన సొంత దర్శకత్వంలో మరో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక నేడు ఆయన 48 పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నారు.

Telegram CEO: షరతులపై బెయిల్ పొందిన టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్..

Exit mobile version