ఈ భూప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు.. నవ మోసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి ప్రేమను పంచాలి.. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది.. అందుకే అమ్మను గౌరవించడం, చివరి రోజుల్లో పసిపాపలాగా చూసుకోవడం మన భాధ్యత.. కానీ ఈరోజుల్లో వయసు పైబడిన తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.. కొందరు అయితే రోడ్ల మీదకు వదిలేస్తున్నారు.. కానీ ఓ స్టార్ హీరో తనకు ఇష్టమైన తల్లికి ఏకంగా గుడి కట్టించాడు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి..
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి అందరికీ తెలుసు.. సినిమాల్లో బిజీగా ఉండే ఆయన ఇటీవల రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా విజయ్ తల్లి దండ్రులకు దూరంగా ఉంటున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. విజయ్‌కు తన తల్లి శోభ అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే ఆమె కోసం ఆలయాన్ని కట్టించేంతగా.. చెన్నైలోని కొరట్టూర్‌లో తన స్థలంలో సాయిబాబా గుడిని కట్టించారనే వార్తలు వినిపిస్తున్నాయి..
అంతేకాదు ఆ ఆలయంలో కుంబాభిషేకాలు, ప్రత్యేక పూజలు కూడా విజయ్ నిర్వహించినట్లు సమాచారం.. ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ మాత్రం అతను చేసిన పనికి ఫిదా అవుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇదే చివరి సినిమా అని తెలుస్తుంది.. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. అంతేకాదు ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కానున్నారు..