Hero Venkatesh eat tiffin at Babai Hotel: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం అని విక్టరీ వెంకటేష్ అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నానని, బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశానని చెప్పారు. విక్టరీ వెంకటేష్ నటించిన 75వ చిత్రం ‘సైంథవ్’. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం విజయవాడలోని ఓ హోటల్‌లో సందడి చేసింది. సైంథవ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సైంథవ్ ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ… ‘సైంథవ్ మూవీ కొత్త కథ, కథనంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు మేచ్చే విధంగా ఉంటాయి. దర్శకుడు శైలేష్ స్టోరీ చెప్పగానే చిత్రం ఒప్పుకున్నాను. హీరోయిన్ శ్రద్ధ ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ప్రేక్షకులు మెచ్చితే సైంథవ్ 2 కూడా తీస్తాము. చాలా సంవత్సరాల తర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నాను. బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. జనవరి 13 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మల్టీస్టార్ చిత్రాల్లో నటిస్తా’ అని అన్నారు.
Also Read: Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల బంధానికి ఆరేళ్లు!
హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం సైంథవ్. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య తదితరులు నటించారు. సైంథవ్ చిత్రం జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. నిజానికి డిసెంబరు 22నే సైంథవ్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. అదే రోజు సలార్ రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
