Sundeep Kishan : తల్లికి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్

New Project

New Project

Sundeep Kishan : యంగ్ హీరో సందీప్‌కిషన్ ప్రస్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఊరిపేరు భైరవకోన’, రాయ‌న్ చిత్రాల‌తో సూప‌ర్ హిట్లు అందుకున్న సందీప్ ఈ మూవీలు ఇచ్చిన స‌క్సెస్‌తో మూడు ప్రాజెక్ట్‌ల‌ను అనౌన్స్ చేశాడు. ఇందులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే డైరెక్షన్లో ‘వైబ్‌’ అనే సినిమా చేస్తున్న సందీప్.. ‘ధమాకా’ మూవీతో మంచి హిట్‌ అందుకున్న దర్శకుడు త్రినాథరావు ద‌ర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇవి కాకుండా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ను సందీప్ ప‌ట్టాలెక్కించ‌బోతున్నట్లు తెలుస్తుంది.

Read Also:Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్‌

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి కంటెంట్ ఉండే విధంగా సందీప్ జాగ్రత్త పడుతున్నాడు. ఇక ఆయన నుండి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతుండడంతో మేకర్స్ కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే, తాజాగా తన కన్నతల్లికి ఓ ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు ఈ హీరో. త్వరలోనే తన తల్లి కనకదుర్గ పుట్టినరోజు వస్తున్న క్రమంలో ఆమెకు బర్త్ డే గిఫ్ట్‌గా ఈ కారును కొనిచ్చినట్లుగా తెలుస్తోంది. సందీప్ కిషన్ తన ఇన్‌స్టో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. తన తల్లి ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తుందని.. ఆమెకు కొడుకుగా ఎప్పటినుండో ఓ కారును కొనివ్వాలని చూశానని… ఇప్పుడు ఆ తరుణం రావడంతో ఆమెకు ఈ కారును బహుమతిగా ఇస్తున్నానని సందీప్ తన పోస్ట్‌లో తెలిపాడు. ఇలాంటి లక్ష్యాలు ఎనలేని సంతోషాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.

Read Also:Success Story: రూ.8 లక్షలతో స్టార్టప్.. ప్రస్తుతం రూ.23,567 కోట్ల బిజినెస్.. విజయ రహస్యం?