NTV Telugu Site icon

Devara : దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం.. అస్సలు ఏమైందంటే..?

Whatsapp Image 2023 11 20 At 7.43.47 Pm

Whatsapp Image 2023 11 20 At 7.43.47 Pm

హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఫ్యామిలీ హీరో గా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు  చేసి ఎంతగానో మెప్పించారు హీరో శ్రీకాంత్..తనదైన టాలెంట్ తో హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలు అలాగే కీలకమైన రోల్స్ ల్లో నటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.శ్రీకాంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ‘సరైనోడు’, ‘అఖండ’, ‘వారసుడు’, ‘హంట్’ మరియు ‘స్కంద’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల గ్యాప్ లో ‘కోటబొమ్మాళి పీఎస్’ చిత్రాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు శ్రీకాంత్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రీసెంట్ ఎపిసోడ్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాలికి బ్లాక్ పట్టి కట్టుకొని కనిపించారు. వెంటనే నాగ్ ఏమైందని అడిగారు. దీంతో ‘దేవర’ మూవీ సెట్స్ లో గాయపడ్డట్టు ఆయన తెలిపారు.దేవర సినిమా ప్రస్తుత షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో సెట్ లోని కంకరపై పరిగెడుతున్న సందర్భంగా గాయమైందని తెలిపారు..డాక్టర్ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ట్రీట్ మెంట్ తర్వాత కూడా షూటింగ్ కు , ప్రమోషన్స్ కు హాజరైనట్టు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. శ్రీకాంత్ వర్క్ డెడికేషన్ కు నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు..మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు..

https://twitter.com/sai_mohan_9999/status/1726278724998533401?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726278724998533401%7Ctwgr%5Ebe62c3f8848c51c3c444f6332cdce2816130c4d2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F