NTV Telugu Site icon

Sai Dharam Tej: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హీరో సాయి ధరమ్ తేజ్‌.. రూ.10 లక్షలు విరాళం

Nara Lokesh

Nara Lokesh

Sai Dharam Tej: వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాకులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి దాతలు చెక్కులను అందజేశారు. మంత్రి నారా లోకేష్‌ను హీరో సాయి ధరమ్ తేజ్ కలిశారు. వరద సాయం కింద రూ.10 లక్షల చెక్కును మంత్రి లోకేష్‌కు సాయి ధరమ్ తేజ్ అందించారు. సాయి ధరమ్ తేజ్‌ను మంత్రి అభినందించారు.

మరోవైపు పలు కంపెనీల ప్రతినిధులు కూడా మంత్రికి విరాళాలను అందజేశారు. డిక్షన్ గ్రూప్ తరపున రూ.1 కోటి చెక్కును మంత్రి లోకేష్‌కు కంపెనీ ప్రతినిధులు అందించారు. నెక్కంటి సీ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధులు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా రూ.25 లక్షలు అందజేశారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన డాక్టర్ కేవి సుబ్బారెడ్డి రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చారు. ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు అందజేశారు.

Read Also: AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేసిన ప్రభుత్వం

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆల్ఫా ఇన్స్టిట్యూట్ రూ. 5 లక్షలు, రైతులు, కార్యకర్తలు కలిసి రూ.5 లక్షలు మంత్రి అందజేశారు. రక్ష హాస్పిటల్స్ నాగరాజు రూ. 5 లక్షలు అందించగా.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది వంశీ కృష్ణ, పెద్ది విక్రమ్ కలిసి రూ.3 లక్షలు అందజేశారు. చదలవాడ చంద్రశేఖర్ రూ. 3 లక్షలు సాయంగా అందించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో సంధ్యా ఆక్వా రూ.1 కోటి, కొండేపి నియోజకవర్గం ప్రజలు, రైతుల తరపున రూ.6. 80 లక్షలు అందజేశారు. భీమవరపు శ్రీకాంత్ రూ.2 లక్షలు, ఆశా బాల రూ.1.8 లక్షలు, వి. జ్యోతి రూ. లక్ష తమ తరఫున వరద బాధితుల సహాయార్థం మంత్రికి అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేసిన అందరికీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Show comments