Site icon NTV Telugu

Nikhil Siddhartha UNIK: తనకు తానే కొత్త స్టార్ ట్యాగ్ ఇచ్చుకున్న స్టార్ హీరో.. ఇకపై అలాగే పిలవాలంటూ

Nikhil Siddhartha Unik

Nikhil Siddhartha Unik

Nikhil Siddhartha UNIK: భారతదేశ చలనచిత్ర పరిశ్రమలలో హీరోలకు, హీరోయిన్లకు పేరు ముందు కొన్ని ట్యాగ్ లను తగిలించి వారిని అలా పిలుస్తుంటారు. కొత్తగా వస్తున్న హీరోలు వారి ఇమేజ్ కు తగ్గట్టుగా స్టార్ ట్యాగ్ పెట్టేసుకుంటుంటే.. మరి కొంతమంది స్టార్ హీరోలు వారికున్న ట్యాగ్ లను మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇదివరకే సుధీర్ బాబు నవ దళపతిగా, హీరో రాజ్ తరుణ్ జోవియల్ స్టార్ గా, శర్వానంద్ చార్మింగ్ స్టార్ అంటూ ఇలా వారు కొత్త ట్యాగ్ చేర్చుకున్నారు.

Read Also: Winter: చలికాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే ఇలా చేయండి!

మరోవైపు స్టార్ హీరోలు వారి పాత ట్యాగులను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగా స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ తన ట్యాగ్ను మార్చుకోగా.. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్ గా మార్చుకున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ నుండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా మార్చుకున్నారు. ఇదే పంథాలో తాజాగా మరో స్టార్ యువ హీరో నిఖిల్ కూడా తన కొత్త స్టార్ ట్యాగ్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

Read Also: Lions Attack Cow: నాలుగు సింహాల మధ్య చిక్కుకున్న ఎద్దు.. తన ప్రాణాలను ఎలా కాపాడుకుందంటే? (వీడియో)

https://twitter.com/actor_Nikhil/status/1858467268767740019
తనకు తానే సోషల్ మీడియా వేదికగా ‘యూనిక్’ అనే కొత్త ట్యాగ్ ను ఇచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ డంను సొంతం చేసుకున్న నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే నిఖిల్ తాజాగా ఈ పోస్ట్ చేశాడు. ఈ కొత్త ట్యాగ్ పై సినీ అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. భిన్న కథలను ఎంచుకొని విజయాలను సాధిస్తున్న వ్యక్తికి ‘యూనిక్’ సరిగ్గా సరిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version