Nani : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు. దసరా సినిమా నుంచి మొదలు పెట్టి హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు. నాని ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నారు. నాని ప్రొడక్షన్ హౌస్ లో హిట్ సినిమా సీక్వెల్ తెరకెక్కుతున్నాయి. అలాగే ఈసారి నాని హిట్ 3 సినిమాతో రాబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయినా సరిపోదా శనివారం సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక నాని ఇప్పుడు హిట్ 3 తర్వాత దసరా దర్శకుడితో మరో మూవీకి కమిట్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Read Also:Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..
తాజాగా పవర్ స్టార్ గురించి హీరో నాని చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. నాని ఇటీవల రానా హోస్ట్ గా చేస్తున్న షోకు గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంలో నాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు ఆయన పాలిటిక్స్ లో కూడా పవర్ స్టారే అని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోనూ.. రాజకీయాల్లోను ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ స్టార్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో ఎదిగారు పవన్ కళ్యాణ్. అక్కడ కూడా పవర్ స్టార్ అనే తనను తాను నిరూపించుకున్నారు. ఎంతో మందికి స్పూర్తినిచ్చారు అని నాని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పై రానా స్పందిస్తూ.. పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన నిజంగానే సూపర్ స్టార్ అంటూ రానా సపోర్ట్ ఇచ్చారు. ఇక పవన్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ముందు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Read Also:Koti Deepotsavam 2024: నేడు సీతారాముల కల్యాణోత్సవం.. ‘కోటి దీపోత్సవం’లో 15వ రోజు కార్యక్రమాలు ఇవే!
