Hero MotoCorp Vida Dirt.E K3: హీరో మోటో కార్ప్ (Hero MotoCorp)కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (Vida). దీని నుండి భారత మార్కెట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన Dirt.E K3 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. Dirt.E K3 ప్రత్యేకత దాని అడ్జస్టబుల్ చాసిస్. అంతేకాదు దీనిలో వీల్‌బేస్, హ్యాండిల్‌బార్ హైట్, రైడ్ హైట్ వంటి అంశాలను మార్చుకునే అవకాశం ఉంది. ఆ బైక్ స్మాల్, మీడియం, హైట్ అనే మూడు సెట్‌లలో లభిస్తుంది.
ఇందులో స్మాల్ (454 mm), మీడియం (544 mm), లార్జ్ (631 mm) సీట్ హైట్ కలిగి ఉంది. దీనితో పిల్లల ఎత్తుకు అనుగుణంగా బైక్ పరిమాణాన్ని మార్చుకోవచ్చు. ఈ బైక్ మొత్తం బరువు కేవలం 22 కిలోలు మాత్రమే. పిల్లల రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని Vida కంపెనీ ఈ బైక్‌లో అనేక ముఖ్య భద్రతా సదుపాయాలను అందించింది. ఇందులో వాకింగ్ మోడ్ కోసం రిమూవ్ చేయగలిగే ఫుట్‌పెగ్స్, హ్యాండిల్‌బార్‌పై ఛెస్ట్ ప్యాడ్, మ్యాగ్నెటిక్ కిల్ స్విచ్, రియర్ మోటర్ కవర్ కలిగి ఉంది.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే టాప్ 10 అద్భుత ఆహారాలు – మీ డైట్‌లో తప్పక చేర్చండి!
ఈ బైక్ రియర్ బ్రేక్‌తో వస్తుంది. అయితే కావాలనుకుంటే ఫ్రంట్ బ్రేక్, పెద్ద వీల్స్, రియర్ సస్పెన్షన్, పెద్ద ఫ్రంట్ సస్పెన్షన్, రోడ్-స్పెక్ టైర్లను అదనపు యాక్సెసరీలుగా కొనుగోలు చేయవచ్చు. ఇందులో 500W ఎలక్ట్రిక్ మోటార్, 360Wh రిమూవ్ చేయగలిగే లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటాయి. ప్రతి మోడ్‌కు ప్రత్యేక స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఇది ప్రారంభ స్థాయిలో ఉన్న పిల్లలు రైడ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. చిన్న ట్రైనింగ్ సెషన్‌లు, ఎంట్రీ లెవెల్ ఆఫ్ రోడ్ రైడింగ్‌కు ఇది అనువైనదిగా ఉంటుంది.
ఇక ఇందులో పేరెంట్స్ కోసం స్మార్ట్ కంట్రోల్స్ అందించబడ్డాయి. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా తల్లిదండ్రులు స్పీడ్ లిమిట్స్ సెట్ చేయడం, యాక్సిలరేషన్ రెస్పాన్స్ మార్చడం, రైడ్ స్టాటిస్టిక్స్ ట్రాక్ చేయడం చేయవచ్చు. పిల్లల కోసం రైడింగ్‌ను సురక్షితంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. Dirt.E K3 మోడల్‌కు ఎర్గోనామిక్స్, మాడ్యులర్ డిజైన్‌ను గుర్తించి అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన ‘Red Dot’ అవార్డు కూడా దక్కింది.
కొత్త స్పోర్టీ, స్టైలిష్ ఆప్షన్‌గా Mini Cooper S Convertible లాంచ్.. ధర ఎంతంటే..?
ఇక మొదటి 300 మంది వినియోగదారుల కోసం ఈ బైక్‌ను రూ. 69,990 (ఎక్స్-షోరూమ్) ధరతో అందిస్తున్నారు. 4 నుండి 10 సంవత్సరాల వయసు గల పిల్లలు డర్ట్ బైకింగ్‌ను ప్రారంభించడానికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది. Vida Dirt.E K3 పిల్లలకు డర్ట్ బైకింగ్ ప్రపంచాన్ని పరిచయం చేసే పర్ఫెక్ట్ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ బైక్. సురక్షితత, అనుకూలత, అధునాతన యాప్ నియంత్రణలు, తక్కువ బరువు వంటి లక్షణాలతో ఈ బైక్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించనుంది.
