Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Hero Motocorp Vida Dirt E K3 Electric Dirt Bike For Kids Launched In India With Adjustable Chassis

పిల్లల కోసం ప్రత్యేకంగా.. కొత్త ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ Hero MotoCorp Vida Dirt.E K3 లాంచ్.. ధర ఎంతంటే..!

Published Date :December 12, 2025 , 4:55 pm
By Kothuru Ram Kumar
  • పిల్లల కోసం ప్రత్యేకంగా Dirt.E K3 ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను లాంచ్
  • సీట్ హైట్, వీల్‌బేస్, రైడ్ హైట్, హ్యాండిల్‌బార్ హైట్ మార్చుకునే అడ్జస్టబుల్ చాసిస్ ప్రధాన హైలైట్.
  • స్మాల్ (454 mm), మీడియం (544 mm), లార్జ్ (631 mm) అనే మూడు కాన్ఫిగరేషన్‌లు.
  • బైక్ బరువు కేవలం 22 కిలోలు మాత్రమే.
పిల్లల కోసం ప్రత్యేకంగా.. కొత్త ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ Hero MotoCorp Vida Dirt.E K3 లాంచ్.. ధర ఎంతంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hero MotoCorp Vida Dirt.E K3: హీరో మోటో కార్ప్ (Hero MotoCorp‌)కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం విడా (Vida). దీని నుండి భారత మార్కెట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్మించిన Dirt.E K3 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. Dirt.E K3 ప్రత్యేకత దాని అడ్జస్టబుల్ చాసిస్. అంతేకాదు దీనిలో వీల్‌బేస్, హ్యాండిల్‌బార్ హైట్, రైడ్ హైట్ వంటి అంశాలను మార్చుకునే అవకాశం ఉంది. ఆ బైక్ స్మాల్, మీడియం, హైట్ అనే మూడు సెట్‌లలో లభిస్తుంది.

ఇందులో స్మాల్ (454 mm), మీడియం (544 mm), లార్జ్ (631 mm) సీట్ హైట్ కలిగి ఉంది. దీనితో పిల్లల ఎత్తుకు అనుగుణంగా బైక్ పరిమాణాన్ని మార్చుకోవచ్చు. ఈ బైక్ మొత్తం బరువు కేవలం 22 కిలోలు మాత్రమే. పిల్లల రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని Vida కంపెనీ ఈ బైక్‌లో అనేక ముఖ్య భద్రతా సదుపాయాలను అందించింది. ఇందులో వాకింగ్ మోడ్ కోసం రిమూవ్ చేయగలిగే ఫుట్‌పెగ్స్, హ్యాండిల్‌బార్‌పై ఛెస్ట్ ప్యాడ్, మ్యాగ్నెటిక్ కిల్ స్విచ్, రియర్ మోటర్ కవర్ కలిగి ఉంది.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే టాప్ 10 అద్భుత ఆహారాలు – మీ డైట్‌లో తప్పక చేర్చండి!

ఈ బైక్ రియర్ బ్రేక్‌తో వస్తుంది. అయితే కావాలనుకుంటే ఫ్రంట్ బ్రేక్, పెద్ద వీల్స్, రియర్ సస్పెన్షన్, పెద్ద ఫ్రంట్ సస్పెన్షన్, రోడ్-స్పెక్ టైర్లను అదనపు యాక్సెసరీలుగా కొనుగోలు చేయవచ్చు. ఇందులో 500W ఎలక్ట్రిక్ మోటార్, 360Wh రిమూవ్ చేయగలిగే లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటాయి. ప్రతి మోడ్‌కు ప్రత్యేక స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. ఇది ప్రారంభ స్థాయిలో ఉన్న పిల్లలు రైడ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. చిన్న ట్రైనింగ్ సెషన్‌లు, ఎంట్రీ లెవెల్ ఆఫ్ రోడ్ రైడింగ్‌కు ఇది అనువైనదిగా ఉంటుంది.

ఇక ఇందులో పేరెంట్స్ కోసం స్మార్ట్ కంట్రోల్స్ అందించబడ్డాయి. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా తల్లిదండ్రులు స్పీడ్ లిమిట్స్ సెట్ చేయడం, యాక్సిలరేషన్ రెస్పాన్స్ మార్చడం, రైడ్ స్టాటిస్టిక్స్ ట్రాక్ చేయడం చేయవచ్చు. పిల్లల కోసం రైడింగ్‌ను సురక్షితంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. Dirt.E K3 మోడల్‌కు ఎర్గోనామిక్స్, మాడ్యులర్ డిజైన్‌ను గుర్తించి అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన ‘Red Dot’ అవార్డు కూడా దక్కింది.

కొత్త స్పోర్టీ, స్టైలిష్ ఆప్షన్‌గా Mini Cooper S Convertible లాంచ్.. ధర ఎంతంటే..?

ఇక మొదటి 300 మంది వినియోగదారుల కోసం ఈ బైక్‌ను రూ. 69,990 (ఎక్స్-షోరూమ్) ధరతో అందిస్తున్నారు. 4 నుండి 10 సంవత్సరాల వయసు గల పిల్లలు డర్ట్ బైకింగ్‌ను ప్రారంభించడానికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది. Vida Dirt.E K3 పిల్లలకు డర్ట్ బైకింగ్ ప్రపంచాన్ని పరిచయం చేసే పర్ఫెక్ట్ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ బైక్. సురక్షితత, అనుకూలత, అధునాతన యాప్ నియంత్రణలు, తక్కువ బరువు వంటి లక్షణాలతో ఈ బైక్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Automobile news
  • Hero MotoCorp
  • Hero MotoCorp EV
  • Hero MotoCorp kids electric bike
  • Hero MotoCorp Vida Dirt.E K3

తాజావార్తలు

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

  • Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!

  • Off The Record: మడకశిరను పట్టించుకోని వైసీపీ హైకమాండ్ .. గందరగోళంలో కేడర్..

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions