Hero MotoCorp hikes prices : వాహనదారులకు బాడ్ న్యూస్. మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.. వెంటనే కొనేయండి లేకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. హీరో మోటో కార్ప్ బైకు ధరలను భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు అన్ని బైకులు, స్కూటర్లపై ఉంటుందని స్పష్టం చేసింది. విడి భాగాల ధరలు పెరగడం వల్ల బైక్స్ ధరలను పెంచక తప్పడం లేదని హీరో సంస్థ తెలిపింది. వచ్చే నెల 1 నుంచి తాము ఉత్పత్తి చేసే అన్ని బైకుల ధరలు పెరుగుతాయని వెల్లడించింది. హీరో మోటో కార్ప్ సంస్థ బైకుల ధరలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు సార్లు పెంచింది. చివరగా సెప్టెంబర్లో ఎక్స్ షోరూమ్ ధరపై రూ.1000 వరకు పెంచింది. కాగా, త్వరలో బజాజ్, టీవీఎస్ సంస్థలు కూడా తాము ఉత్పత్తి చేసే వాహన ధరలను పెంచే అవకాశమున్నట్లు సమాచారం. టీవీఎస్ అక్టోబర్ లోనే తమ బైకుల ధరను పెంచింది. బజాబ్ మాత్రం జులై తరువాత వాహనాల ధరలను పెంచలేదు.
Read Also: Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
బైక్ మోడల్ ను, రాష్ట్రాన్ని బట్టి ఎక్స్ షో రూమ్ ధరపై రూ. 1500 వరకు రేట్లను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెరుగుదల ఒత్తిడిని తట్టుకునేలా కస్లమర్లకు సులువైన ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తామని ప్రకటించింది. అయితే, ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాహన డీలర్లు అభిప్రాయపడుతున్నారు. వాహనాల అమ్మకాలు తగ్గిపోతాయని, ఆ మేరకు లాభాల్లో కోత పడుతుందని జోస్యం చెప్పారు. అదీకాక, నిత్యావసర ధరలు పెరుగుతుండడంతో వినియోగిదారుడిపై పెను భారం పడుతోందని, ఇదే సమయంలో వాహనాల ధరలను పెంచడం వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
