తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరి మనసు దోచుకున్నాడు.. అంతేకాదు సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. అయితే ఈ హీరోకు తల్లి అంటే అమితమైన ప్రేమ.. ఎంత ఇష్టం అంటే ఆమె కోసం గుడి కట్టించేంత ఇష్టం.. తన తల్లికి సాయి బాబా అంటే చాలా ఇష్టం.. ఆమె కోసం తన స్థలంలో ఒక గుడిని కట్టించాడు విజయ్.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
తన తల్లి చిరకాల కోరికను విజయ్ తీర్చేశాడు. సాయి బాబా గుడిని కట్టించి ఇచ్చాడు. దీంతో తల్లి కోరికను కొడుకు నేరవేర్చాడు.. విజయ్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.. ఇక తాజాగా ఈ గుడిని ప్రముఖ హీరో, డైరెక్టర్ లారెన్స్ సందర్శించాడు.. బాబాను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ మేరకు విజయ్ తల్లితో కలిసి గుడిలోని బాబాను లారెన్స్ దర్శించుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఈ వీడియోను స్వయంగా హీరో లారెన్స్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు.. అందరికీ హాయ్.. ఈ రోజు నేను నా స్నేహితుడు విజయ్ తన తల్లి కోసం కట్టించిన సాయి బాబా గుడికి వెళ్లాను.. విజయ్ తల్లి గారితో కలిసి గుడికి వెళ్లాను. నేను రాఘవేంద్ర స్వామి గుడిని కట్టినప్పుడు ఆ తల్లే అక్కడ పాటలు పాడారు.. ఇప్పుడు ఆమెతో కలిసి బాబాను దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ x లో రాసుకొచ్చాడు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే..
Hi everyone, I visited Nanban Vijay’s Sai Baba Temple today along with his mother. When I built My Raghavendra Swamy temple, She sang a song in our temple and graced us with her presence. Today, I’m happy to visit their temple with her. My heartfelt wishes to Nanban Vijay… pic.twitter.com/sZvzFqC0LL
— Raghava Lawrence (@offl_Lawrence) April 13, 2024