NTV Telugu Site icon

Great Republic Day Sale 2025: అమెజాన్‌లో గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌.. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవే!

Amazon Great Freedom Festival Sale

Amazon Great Freedom Festival Sale

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌’ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 13 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్ బ్యానర్ ప్రస్తుతం అమెజాన్ యాప్‌, వెబ్‌సైట్‌లో ఉంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లు, ఈఎంఐ కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌ టీవీలు, ప్రొజెక్టర్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్స్, వాషింగ్ మెషీన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ యాక్సెసరీస్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌పై భారీగా ఆఫర్లు ఉంటాయని అమెజాన్‌ పేర్కొంది. సేల్‌కు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

Also Read: Gautam Gambhir: గంభీర్‌ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదు: మనోజ్ తివారీ

సేల్‌లో యాపిల్‌, ఐకూ, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, రియల్‌మీ, రెడ్‌మీ మొబైల్స్‌పై భారీగా డీల్స్‌ ఉండబోతున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్‌ నార్డ్‌4, వన్‌ప్లస్‌ సీఈ 4, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 లైట్‌ ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నాయి. అయితే ఎంతమేర డిస్కౌంట్ అనేది ఇంకా వెల్లడించలేదు. తాజాగా లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ 13, 13ఆర్‌ ఫోన్లు కూడా ఈ సేల్‌లో విక్రయానికి రానున్నాయి. అమెజాన్‌ అలెక్సా, ఫైర్‌టీవీ డివైజులపైనా ఈ సేల్‌లో డిస్కౌంట్లు లభించబోతున్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 65 శాతం వరకు తగ్గింపు ఉంటాయి.

Show comments