iphone Battery Life Tips: మీ ఐఫోన్ ఛార్జింగ్ ఇట్టే అయిపోతోందా?.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్‌లో కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఐఫోన్‌లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు మొదటగా చేయాల్సింది ‘ఐఓఎస్ అప్‌డేట్’ అని యాపిల్ తెలిపింది. కొత్త ఐఓఎస్ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం పేర్కొంది. ఈ అప్‌డేట్‌లు కొత్త ఫీచర్‌లను అందించడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్‌ను, డివైజ్ సామర్థ్యాన్ని పెంచుతుందట. ఎప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చినా.. వెంటనే చేయాలని యాపిల్ చెబుతోంది.
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ఐఫోన్‌లు 16- 22 ఉష్ణోగ్రతలోనే మెరుగ్గా పనిచేస్తాయని యాపిల్ తెలిపింది. ఒకవేళ ఐఫోన్‌కు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి తగిలితే.. బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట. చల్లని వాతావరణంలో ఐఫోన్‌ను ఉంచినా.. బ్యాటరీ లైఫ్ తగ్గుతుందట. ఐఫోన్ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంటే.. బ్యాటరీ లైఫ్ బాగుంటుందని కంపెనీ చెబుతోంది.
ఐఫోన్ రక్షణ కోసం దాదాపుగా అందరూ కేస్ లేదా పౌచ్‌లు వాడుతుంటారు. వాటితో పాటు ఛార్జింగ్ చేయడం మంచిది కాదని యాపిల్ అంటోంది. ఛార్జ్ చేసే సమయంలో ఐఫోన్ వేడెక్కుతుంది. కేసులు వేడిని బయటకు పోనీయకుండా చేయడంతో బ్యాటరీ దెబ్బతింటుంది. అందులకే ఫోన్ ఛార్జ్ సమయంలో పౌచ్ లేదా కేస్‌ల ఐఫోన్‌కు ఉంచరాదని కంపెనీ పేర్కొంది.
Also Read: IPL 2024 Playoffs: సీఎస్‌కేకు భారీ షాక్.. ప్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ!
ఐఫోన్‌ను కొన్ని రోజులు వాడొద్దని అనుకున్న సమయంలో ఫుల్ ఛార్జి లేదా పూర్తిగా ఛార్జింగ్ లేకుండా పక్కన పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఫోన్ పనితీరు మాత్రమే కాదు బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతాయట. ఫోన్‌ను కొన్ని రోజులు ఉపయోగించకుండా ఉంచాలనుకుంటే.. 50 శాతం ఛార్జింగ్ ఉంచడం మంచిదని యాపిల్ తెలిపింది. ఒక వేళ మీరు ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు అనుకుంటే.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఛార్జింగ్ చేయాలని చెప్పింది. లోపవర్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ బాగుంటుందట.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?