NTV Telugu Site icon

Rachin Ravindra Name: ‘రచిన్’ రవీంద్ర పేరు వెనుక ఓ స్టోరీ.. ద్రవిడ్, సచిన్‌తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Rachin Ravindra Name

Rachin Ravindra Name

Do you know the connection between Dravid and Sachin with Rachin Ravindra’s Name: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు..’రచిన్ రవీంద్ర’. ఇందుకు కారణం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించినా.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నా.. ఆదిలోనే ఓ వికెట్ పడినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాను ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 82 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రచిన్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. అయితే రచిన్ రవీంద్ర పేరు వెనుక ఓ స్టోరీ ఉంది. అది భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లకు కూడా సంబంధం ఉంది.

23 ఏళ్ల రచిన్‌ రవీంద్ర భారతీయుడు కాదు కానీ.. భారత సంతతికి చెందిన కుర్రాడే. రచిన్‌ తండ్రి రవి కృష్ణమూర్తి బెంగళూరులో నివసించేవారు. అతను 1990లలో న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడిపోయారు. రచిన్ 1999లో వెల్లింగ్టన్‌లో జన్మించాడు. కొడుకు పుట్టగానే అతడికి రచిన్‌ రవీంద్ర అని పేరు పెట్టాలని రవి కృష్ణమూర్తి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే.. భారత మాజీ దిగజాలు సచిన్ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లకు రవి కృష్ణమూర్తి పెద్ద ఫ్యాన్.

Also Read: ENG vs NZ: పాపం డెవాన్ కాన్వే.. ఆ ఆనందంను 15 నిమిషాలు కూడా ఉంచని రచిన్‌ రవీంద్ర!

ఇద్దరు భారతీయ దిగ్గజాల పేర్లు కలిసేలా.. రవి కృష్ణమూర్తి తన కుమారుడికి ‘రచిన్‌’ అని పేరు పెట్టాడు. రాహుల్ ద్రవిడ్ పేరులోని ‘ర’ అనే అక్షరాన్ని, సచిన్ పేరులోని ‘చిన్‘ అనే అక్షరాలతో కొడుకుకు ‘రచిన్’ రవీంద్ర అని నామకరణం చేశాడు. అంతేకాదు తన కొడుకు క్రికెట్ భారత దిగ్గజాల మాదిరి క్రికెట్ ఆడాలని కోరుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో సెంచరీ చేయడంతో రవి కృష్ణమూర్తి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ ముందే రచిన్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ సెంచరీ చేశాడు. వన్డే ప్రపంచకప్‌ 2023కి సచిన్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.