Rachin Ravindra Name: ‘రచిన్’ రవీంద్ర పేరు వెనుక ఓ స్టోరీ.. ద్రవిడ్, సచిన్‌తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do you know the connection between Dravid and Sachin with Rachin Ravindra’s Name: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు..’రచిన్ రవీంద్ర’. ఇందుకు కారణం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించినా.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నా.. ఆదిలోనే ఓ వికెట్ పడినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాను ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 82 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రచిన్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. అయితే రచిన్ రవీంద్ర పేరు వెనుక ఓ స్టోరీ ఉంది. అది భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు కూడా సంబంధం ఉంది.
23 ఏళ్ల రచిన్ రవీంద్ర భారతీయుడు కాదు కానీ.. భారత సంతతికి చెందిన కుర్రాడే. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి బెంగళూరులో నివసించేవారు. అతను 1990లలో న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడిపోయారు. రచిన్ 1999లో వెల్లింగ్టన్‌లో జన్మించాడు. కొడుకు పుట్టగానే అతడికి రచిన్ రవీంద్ర అని పేరు పెట్టాలని రవి కృష్ణమూర్తి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే.. భారత మాజీ దిగజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు రవి కృష్ణమూర్తి పెద్ద ఫ్యాన్.
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
Also Read: ENG vs NZ: పాపం డెవాన్ కాన్వే.. ఆ ఆనందంను 15 నిమిషాలు కూడా ఉంచని రచిన్ రవీంద్ర!
ఇద్దరు భారతీయ దిగ్గజాల పేర్లు కలిసేలా.. రవి కృష్ణమూర్తి తన కుమారుడికి ‘రచిన్’ అని పేరు పెట్టాడు. రాహుల్ ద్రవిడ్ పేరులోని ‘ర’ అనే అక్షరాన్ని, సచిన్ పేరులోని ‘చిన్‘ అనే అక్షరాలతో కొడుకుకు ‘రచిన్’ రవీంద్ర అని నామకరణం చేశాడు. అంతేకాదు తన కొడుకు క్రికెట్ భారత దిగ్గజాల మాదిరి క్రికెట్ ఆడాలని కోరుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో సెంచరీ చేయడంతో రవి కృష్ణమూర్తి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందే రచిన్ తన కెరీర్‌లో మొదటి అంతర్జాతీయ సెంచరీ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023కి సచిన్‌ను గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.
Rachin Ravindra, there is a story behind his name.
Ra From “Ra”hul Dravid & chin from Sa”chin” Tendulkar as his parents were huge Sachin & Dravid fans. pic.twitter.com/JTjxLqWPS2
— Johns. (@CricCrazyJohns) October 5, 2023
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!