NTV Telugu Site icon

Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కీలక అంశాలివే..

Pension

Pension

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. సీపీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. కేంద్రం ఈ నిర్ణయంతో వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో ఏ ఏ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి. ఎంత పెన్షన్ వస్తుందనే విషయాలు తెలుసుకుందాం.

Read Also: Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..

కచ్చితమైన పెన్షన్
దీని వల్ల కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే 10 ఏండ్ల కనీస సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆ మేరకు తగిన పెన్షన్ లభిస్తుంది.

కుటుంబ పెన్షన్
ఒకవేళ పెన్షనర్ మరణిస్తే.. చివరిగా డ్రా చేసిన మొత్తంలో 60 శాతాన్ని కుటుంబానికి అందజేస్తారని చెప్పారు. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా.. నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త స్కీం వర్తించనుంది.

ఎన్‌పీఎస్, యూపీఎస్ చేసుకునే అవకాశం
ఉద్యోగులకు ఎన్‌పీఎస్, యూపీఎస్ మధ్య ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎన్పీఎస్ లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తోంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా.. వేతనంలో 50 శాతం వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది. ఎన్పీఎస్ చందాదారులంతా యూపీఎస్ లోకి మారొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 1) నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం
23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ తో ప్రయోజనం చేకూరుతుందని.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరాలని భావిస్తే 90 లక్షల మందికి లాభం కలుగుతుందని కేంద్రం చెబుతుంది. ఉద్యోగులు కొత్తగా తీసుకొస్తున్న యూపీఎస్ ను ఎంచుకుంటే అదనపు భారం పడదు. ప్రస్తుతమున్న 10 శాతం చందానే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటా 14.5 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుంది.

ద్రవ్యోల్బణ సూచిక ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి యూపీఎస్ బకాయిలను చెల్లించడానికి రూ. 800 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. తన వాటా పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా రూ.6,250 కోట్లను భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరితే అదనపు భారాన్ని అవే చెల్లించాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత, గ్రాట్యుటీతో పాటు, ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు నెలవారీ జీతంలో పదోవంతు (జీతం + డీఏ) ఇవ్వబడుతుంది. ఈ మొత్తం స్థిర పెన్షన్ కంటే తక్కువ కాదు.